గ్రహములు, ఉప గ్రహములు, లగ్నము


గ్రహములు – ఉప గ్రహములు – లగ్నము


గ్రహములు (Planets) :

జ్యోతిష్యశాస్త్ర రీత్యా మొత్తం తొమ్మిది గ్రహములు(Planets) కలవు. అవి – సూర్యుడు (Sun ), చంద్రుడు (Moon), కుజుడు (Mars ), బుధుడు (Mercury ) , గురుడు (Jupiter ♃), శుక్రుడు (Venus ), శని (Saturn ♄), రాహు (North Node or Head of Dragon) మరియు కేతు (South Node or Tail of Dragon).  వాస్తవానికి మొదటి ఏడు గ్రహాలకే స్థూల ఆకారము కలదు.  చివరి రెండు అయిన రాహు, కేతు గ్రహాలకు రూపం లేదు.  అందుకే వీటిని ఛాయా గ్రహములు (Shadow Planets) అని అందురు.  ఇవి వాస్తవంగా గ్రహాలు కావు.  కేవలము గణితశాస్త్ర బిందువులు (mathematical points) మాత్రమే.  

ఉప గ్రహములు (Sub-planets or satellites) :

పై 9 గ్రహాలు కాకుండా, 11 ఉప గ్రహములు (Sub-planets or satellites) కలవు.  ఇవి కూడా చర స్థితిలో ఉన్న గణితశాస్త్ర బిందువులు (moving mathematical points).  

లగ్నము (Ascendant) :

అంతేకాకుండా, జ్యోతిష శాస్త్రములో లగ్నము (ascendant) కూడా అత్యంత ప్రధానమైనది.  భూమి తనచుట్టూ తాను తిరుగుచుండగా తూరుపు దిశగా భూమ్యాకాశములు కలిసినట్లు కనపడే తూర్పు క్షితజ బింధువును  (point that raises on the eastern horizon) లగ్నము (ascendant) అందురు.